ఓవర్ చేసిన వాళ్ళంతా ఇంకా జీఏడిలోనే ?

చంద్రబాబునాయుడు హయాంలో కొంతమంది అఖిల భారత సర్వీసు అధికారులు బాగా ఓవర్ యాక్షన్ చేశారు. అలాంటి వారిలో అత్యధికులకు జగన్మోహన్ రెడ్డి ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు. సుమారు ఐదుమందిని జిఏడిలో రిపోర్టు చేయమని పది రోజుల క్రితమే చెప్పిన విషయం తెలిసిందే. తాజా పోస్టింగుల్లో వీళ్ళెవరికీ ఎక్కడా పోస్టులు దక్కకపోవటంతో సర్వత్రా చర్చ మొదలైంది.

చంద్రబాబునాయుడు హయాంలో సిఎంవో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర ఉండేవారు. అలాగే సాయిప్రసాద్, గిరిజాశంకర్, రాజమౌళి కూడా విధులు నిర్వహించారు. సిఆర్డీఏ అజయ్ జైన్, విజయానంద్ లాంటి వాళ్ళు అపరమితమైన అధికారాలను చెలాయించారనే ఆరోపణలున్నాయి. సతీష్ చంద్ర అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారట. ఒక్క గిరిజాశంకర్ కు మాత్రమే పోస్టింగ్ వచ్చింది.

వీరు కాకుండా అప్పటి డిజిపి ఆర్పి ఠాకూర్,  ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అండ్ కో కూడా తమ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. వీళ్ళంతా తాము అఖిల భారత సర్వీసు అధికారులమన్న కనీస స్పృహ కూడా లేకుండా చంద్రబాబు కోటరిగా ముద్ర వేయించుచోవటానికే ఇష్టపడ్డారు. వీరిపై టిడిపి నేతల్లో కూడా బాగా మంటగా ఉండేది.

సరే అధికారం మారగానే జగన్ వీళ్ళందరినీ జీఏడిలో రిపోర్టు చేయమని ఆదేశించారు. దాంతో వారం రోజులుగా వాళ్ళంతా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా 50 మందిని బదిలీలు చేశారు. వీళ్ళకు కూడా పోస్టింగులు వస్తాయని అనుకున్నారు. కానీ వీళ్ళకు  ఎక్కడా పోస్టింగులు రాలేదు. దాంతో ఈ విషయం సర్వత్రా చర్చ మొదలైంది.