AP: పవన్ కళ్యాణ్ నువ్వు మగాడివైతే బయటకు రా… సవాల్ విసిరిన వైకాపా మాజీ ఎమ్మెల్యే?

AP: తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి ఘటన రాజకీయ దుమారం లేపుతుంది. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే భక్తుల ప్రాణాలు పోయాయి అంటూ వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కేవలం కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము నిందలు మోయాల్సి వస్తుందని మా ప్రభుత్వ పరువు పోయిందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఇకపోతే ఈ ఘటన గురించి వైకాపా నేతలందరూ కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే రాప్తాడు వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సైతం తిరుపతి ఘటన గురించి స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అయితే ఇందులో భాగంగా ఈయన సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తిరుపతిలో తొక్కిసలాట చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా అంటూ ప్రశ్నించారు. పోలీసులందరూ కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు భక్తుల భద్రతను గాలికి వదిలేసారని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ పదుల సంఖ్యలో హిందువులు మృతి చెందుతున్నారని సనాతన ధర్మం ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత వహించరనీ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ వచ్చి క్షమించండి తప్పు జరిగిపోయిందనీ క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మా ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఫెయిల్యూర్ అయ్యారని వెంటనే తనని తొలగించాలంటూ కూడా డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పదేపదే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. పోలీసుల బలగాలన్నీ కుప్పం ముఖ్యమంత్రి పర్యటనకు అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లాయని.. తిరుపతి కు వచ్చే భక్తుల భద్రతను మాత్రం గాలికి వదిలేసింది అంటూ ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు.