మోదీ, అమిత్ షా, కెసియార్, జగన్ అంటే ‘కుట్ర చతుష్టయం’

వారంతా కలసి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకుట్ర రచించారు

 మీడియా స‌మావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు…

చంద్రబాబు ఏమన్నారంటే…

ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేశారు. సాక్ష్యాలతో సహా దేశం ముందు బైటపెడుతున్నాను. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు దీనిపై ఆలోచించాలి. దుష్ట చతుష్టయం కుట్రలు దేశం యావత్తూ  తెలుసుకోవాలి.

 ప్రధాని  నరేంద్రమోది, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, వైసిపి నేత జగన్ బరితెగించారు. ప్రజలు అసహ్యించుకుంటారు అనేది వదిలేశారు. ప్రజలు ఛీ కొడతారు అనే భయం లేకుండా కుట్ర చేశారు.

ఒక మహా కుట్రకు ఏవిధంగా నాంది పలుకుతారో ఇదే రుజువు. చాలా నీచాతినీచంగా వ్యవహరించారు.

విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ – ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు.

ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న మరునాడే (23.02.2019), ఐటి గ్రిడ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీపైన తెలంగాణ పోలీసులతో చట్టవిరుద్దంగా దాడి చేయించారు. టిడిపి సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశారు. రాత్రికి రాత్రి అశోక్ ఆఫీస్ పై దాడి చేయడం, నలుగురు ఉద్యోగులను బెదిరించడం, వాళ్ల కుటుంబ సభ్యులను వేధించడం అన్నీ చేశారు.

విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 22నే ఢిల్లీలో ఇచ్చారు, 23న హైదరాబాద్‌లో దిగారు, ఆ రోజే అశోక్ కంపెనీపై దాడి చేశారు. 26.02.2019 న టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనిపై వచ్చింది. ‘‘డేటా బ్రీచ్ బై టిడిపి యాప్..? యుఐడిఏఐ (ఉడాయ్), ఈసి లాంచ్ ప్రోబ్’’ శీర్షికతో వచ్చింది. అందులో ఫిర్యాది విజయసాయి రెడ్డి అని స్పష్టంగా రాశారు. తాను ఫిర్యాదు చేశానని విజయసాయి ఎందుకని చెప్పలేదు.?

23.02.2019న దాడి, సోదాలు, ఎంక్వైరీ, బెదిరించడం ఫొటోలతో సహా బైటకొచ్చింది. 02.03.2019 అర్ధరాత్రి 12.15కు ఫిర్యాదు వచ్చింది. ఎవరన్నా అర్ధరాత్రి ఇలాంటి ఫిర్యాదు చేస్తారా..? అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే, ఉదయం 7గంటలకల్లా ఉద్యోగుల ఇళ్లకెళ్లి సోదాలు, వేధింపులు.. తెల్లకాగితాలపై విఆర్ వోల సంతకాలు తీసుకోవడం ఏంటని..? అంటూ కేసు అథెంటిసిటిపైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది.

కేస్ డైరీ చూస్తే, ఇన్వెస్టిగేషన్ పైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొంది. మార్చి 3 సాయంత్రం 7గంటల కల్లా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇంకో ఫిర్యాదు. దశరథరామి రెడ్డి అనేవాడితో మరో కంప్లయింట్ రిజిస్టర్ చేస్తారు. 07.03.2019న సిట్ ఛీఫ్ (స్టీఫెన్ రవీంద్ర) ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు 23 వతేది దాడి, సోదా నిజమేనని ఒప్పుకున్నాడు. హైకోర్ట్ తప్పు పట్టింది అనేది సైబరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ లో చెప్పరు. ఫిబ్రవరి 23 ముందే విచారణ చేశామని సిట్ ఛీఫ్ (స్టీఫెన్ రవీంద్ర) ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ విచారణ గురించి సైబరాబాద్ కమిషనర్ ఎందుకు చెప్పలేదు..?

ఫిబ్రవరి 22 దాడి,సోదాల ఫొటోలు టిడిపి నేతలు విడుదల చేశారు. ఆ తరువాతే సిట్ ఛీఫ్ విచారణ నిజమే అని ఒప్పుకున్నారు. ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న విచారణ పేరుతో ఐటి గ్రిడ్ కంపెనీపై దాడి చేశారు..? ఎవరి ఫిర్యాదుతో కంపెనీలో డేటా తీసుకుపోయారు.? అక్కడి ఉద్యోగులను బెదిరించారు..? ఆ ఫిర్యాదుదారు విజయసాయి రెడ్డేనా?

ఫిబ్రవరి 23, మార్చి 2,3,4 తేదీలలో విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు..? ఆ 4 రోజులు హైదరాబాద్ లో మకాం వేశారా, లేదా..?. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు.

అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారా లేదా..?. సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్‌లో అన్నీ రాశారు. దేశం ముందు ఈ సాక్ష్యాధారాలు ఉంచుతున్నాను. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే వీళ్లను చీత్కరించాలి. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం…. అంతా ‘‘ ప్రి-ప్లాన్డ్ కాన్స్ఫిరసి’’.

కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. దేశ చరిత్రలో ఇంత మహాకుట్ర చూడలేదు, వినలేదు.