AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నాయకుడు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కాపు ఉద్యమ నేతగా మాజీఎమ్మెల్యేగా ఎంతో మంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈయన కాపులకు మద్దతు తెలియజేయకుండా వైసిపి పార్టీ చెంతన చేరటంతో విమర్శలు ఎదురుకుంటున్నారు.
ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముద్రగడ చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో నేను చంద్రబాబు నాయుడుతో కలిసి తన పార్టీలో కొనసాగాను వైయస్సార్ గారితో కూడా నాకు చాలా మంచి అనుబంధము ఉంది కానీ అప్పట్లో ఇలాంటి రాజకీయాలు ఉండేవి కాదని ఎంతో స్నేహపూరితమైన రాజకీయాలు ఉండేవని తెలిపారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని తెలిపారు. ఇది మంచి సాంప్రదాయం కాదంటూ కూడా తెలియజేయడం జరిగింది.. ప్రతి అమావాస్య తర్వాత కచ్చితంగా పౌర్ణమి పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుందంటూ గుర్తు చేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారు అప్పుడు కూడా ఆయన రెడ్ బుక్ తరహాలో పాలన కొనసాగిస్తే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
ఇలాంటి విషయంలో జగన్ సమయమనం పాటించిన వైసీపీ శ్రేణులు కచ్చితంగా ఒత్తిడికి లోనవుతున్నారు.. ఈ విషయంలో జగన్ పై కూడా ఒత్తిడి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా తన వైఖరిని చంద్రబాబు నాయుడు మార్చుకుని పాలనపై దృష్టి సాధించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ ఈయన లెటర్ రాశారు.