వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్సదంగా మృతి చెందారు.అయితే ఆయన తన మరణానికి కొద్ది గంటల ముందు ప్రచారంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని క్షణాల్లోనే ఆయన మరణించడం విషాదంగా మారింది.
గురువారం చాపాడు మండలంలో వివేకానంద రెడ్డి ప్రచారం నిర్వహించారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తనకు చాలా బాధ కలిగించిందని, తమ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పుకొచ్చారు. బాబాయ్ అంటే జగన్ కు ఎంతో అభిమానమని అన్నారు. నిన్న రాత్రి 11 గంటల వరకూ కూడా ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి, ఆపై ఇంటికెళ్లారని చెప్పారు.