YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు అంటూ జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుపతి జనసేన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించగా.. నగరంలోని యాభై డివిజన్ ల నుంచి జనసేన నాయకుల హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని ఈయన తెలియజేశారు. డివిజన్ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని సంక్రాంతి తర్వాత అన్ని డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాలను స్థాపించి డివిజన్ల వారీగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
మరోవైపు ఏడాది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కార్పోరేషన్ ఎన్నికల నాటికి మన పార్టీని మరింత బలోపేతం చేసుకొని అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి జనసేన నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేవలం కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే కాదు ఏ ఎన్నికలు వచ్చినా కూడా జనసేన బలం ఏంటో నిరూపించాలని తెలిపారు.
ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు.గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నేతలను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుని వైసిపి గెలిచింది. ప్రజాబలంతో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తుంది. జనసేన కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. రాయలసీమలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అంటూ ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.