తెలంగాణ అసెంబ్లీలో జూనియర్, సీనియర్లు ఎమ్మెల్యేలు వీరే

తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గురువారం మొదటి సారిగా సమావేశమయ్యింది. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సారి అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా వయసు రీత్యా వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా గెలిచారు. ఇక అత్యంత పిన్న వయస్కురాలిగా బానోతు హరిప్రియా నాయక్ ఉన్నారు. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమె ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఎక్కవ సార్లు గెలిచిన లెక్క చూస్తే సీఎం కేసీఆర్ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూనియర్, సీనియర్ లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం.

ఉమ్మడి అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ప్రస్తుతం ఎన్నికైన వారు 16 మంది. గత అసెంబ్లీలో సభ్యులుగా ఉండి మళ్లీ ఎన్నికైన వారు 76 మంది. ఫస్టు టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 23 మంది. ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 02. ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు 3. మైనార్టీ సభ్యులు 8, మహిళా సభ్యులు 6, ఆంగ్లో ఇండియన్ 1. ఎమ్మెల్యేలుగా ఉన్నారు.