TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని పూర్తిస్థాయిలో తప్పుపడుతూ తనని అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ పట్ల తీవ్ర రాజకీయ నాయకులు అదే విధంగా సినిమా సెలబ్రిటీలు కూడా తీవ్రంగా విమర్శలు కురిపించారు. అల్లు అర్జున్ ఈగో కారణంగానే నేడు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ పలువురు సెలబ్రిటీల విమర్శించారు.
ఇలా అల్లు అర్జున్ విషయంలోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలోనూ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కేసు విషయంలో తెలంగాణ సర్కారుకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఆరోజు రాత్రి జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విపరీతమైన లాఠీ ఛార్జ్ చెయ్యాల్సి వచ్చింది. ఈ ఘటన కారణంగా కాస్త అలజడి రేగింది. అయితే దీనిపై NHRC (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) ఘాటుగా స్పందించారు.
ఆరోజు రాత్రి సంధ్య థియేటర్ వద్ద ప్రేక్షకులపై లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేసింది.ఈమేరకు లాయర్ రామారావు దాఖలు చేసిన పిటీషన్ ని విచారించిన కమీషన్ సభ్యులు, నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్ కి ఆదేశాలు జారీ చేసారు. మరి ఈ విషయంపై డీజీపీ నుంచి ఏ విధమైనటువంటి వివరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఈ ఘటన పై పోలీసులు అల్లు అర్జున్ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పది నిమిషాల వీడియో ఫుటేజీ ని విడుదల చేసారు. అల్లు అర్జున్ అక్కడికి రావడంతో వేల సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా తరలి రావడంతోనే పోలీసులు లాటి చార్జ్ చేయాల్సి వచ్చిందని లాయర్ రామారావు ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలతో సహా ఆయన కమిషన్ కి అందచేయగా, కమీషన్ చాలా తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై మండిపడింది.