Tirumala: తెలంగాణ నుంచి తిరుమల కొండకు భారీ ఆదాయం… మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

Tirumala: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి కొండా సురేఖ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె తన శాఖకు సంబంధించిన అంశాల గురించి కాకుండా గతంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకుల గురించి వారి విడాకులకు కేటీఆర్ ప్రమేయం ఉంది అంటూ ఈమె మాట్లాడటంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

ఇలా అప్పటినుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుమలకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోందంటూ ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నా అంటూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం దేవస్థానం మా గుడిగా ఉండేది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీశైలం అని మేము కోల్పోయామని కొండ సురేఖ తెలిపారు. అయినప్పటికీ మాకు మల్లన్న పై ఎంతో భక్తి ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కొండ సురేఖ మాట్లాడారు. ఏపీలో టీటీడీ నుంచి ఇబ్బంది ఉంది, తెలంగాణ భక్తులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు.

గతంలో తిరుమలలో పద్ధతులు, నియమాలు ఉండేవి.. అలానే ఇప్పుడు కూడా తెలంగాణకు ఇవ్వాలని ఏపీ సీఎం కోరాం.. ఈ విషయంపై కమిటీ వేసామని ముఖ్యమంత్రి చెప్పినట్లు కొండ సురేఖ తెలిపారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కళ్యాణ మండపాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చేవి అయితే ఇప్పుడు కూడా ఆ నిధులను మంజూరు చేయాలి అంటూ ఈమె కోరారు. తెలంగాణలో ప్రాచీనాలయాలు ఎక్కువగా గ్రామ గ్రామాన కళ్యాణ మండపాలు అడుగుతున్నారని తెలిపారు. టిటిడి ఒప్పుకొని ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నట్టు ఈ సందర్భంగా కొండ సురేఖ తెలిపారు.