TDP: తెలంగాణలోకి ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న టీడీపీ… ఆ పార్టీకి చుక్కలేనా?

TDP: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు అక్కడ రాజకీయ నాయకులతో కూడా ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో మరోసారి తెలంగాణలో కూడా తమ పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తిరిగి తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయటానికి సిద్ధమవుతుందని సొంత పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి రీఎంట్రీ రాబోతుందనే విషయం తెలియడంతో అక్కడ ఏ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయి అనే విషయంపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ తెలంగాణలో కార్యకర్తలపై మొదలుపెడితే.. బిజెపితో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్ళవచ్చని భావిస్తున్నారు.

నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పోటీ చేస్తుందని భావించారు ఇలా తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ విజయం అందుకోవడం అసాధ్యం అవుతుందని భావించిన రేవంత్ రెడ్డి ఇదే విషయం గురించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారట దీంతో ఈయన ఆ ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో దృష్టి కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పైనే పెట్టడంతో తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయలేకపోయారు కానీ ఇక్కడ మంచి మెజారిటీ సొంతం చేసుకున్న చంద్రబాబు తిరిగి తెలంగాణలో కూడా తన పార్టీని బలపరుచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరి తెలంగాణలోకి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇస్తే అక్కడ ఏ పార్టీకి ప్లస్ అవుతుంది ఏ పార్టీకి చుక్కలు చూపెడతారు అనేది తెలియాల్సి ఉంది.