ఒక్క ‘కులం’ కోసమే చంద్రబాబు సిఎంగా ఉన్నారా ?

అలాగే ఉంది చూడబోతే. గతంలో చంద్రబాబునాయుడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చిసినపుడు రానీ ఆరోపణలు, విమర్శలు ఇఫుడు మాత్రం చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయ్. దానికితోడు చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీలో కావచ్చు లేదా కీలక వ్యక్తుల్లో అత్యధికులు కావచ్చు చంద్రబాబు సామాజికవర్గమే కావటంతో ఆరోపణలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయ్. అందుకు తగ్గట్లే పాలనాపరంగా కూడా కీలకమైన పోస్టుల్లో ఎక్కువగా తన సామాజికవర్గం వారే కనిపిస్తుండటంతో ఇతర సామాజికవర్గాల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.

 

చీఫ్ సెక్రటరీ, డిజిపి లాంటి కీలకమైన పోస్టుల్లో తనిష్టం వచ్చినట్లు, తన సామాజికవర్గం వాళ్ళను నియమించుకవటం అన్నీ సార్లు సాధ్యంకాదు కాబట్టి మధ్యలో ఇతర సామాజికవర్గం వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. లేకపోతే ఆ పోస్టుల్లో కూడా కమ్మ సామాజికవర్గం వాళ్లు తప్ప ఇతరులకు అవకాశం ఉండేది కాదేమో. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తన పుస్తకం ‘ నవ్యాంధ్రలో నా నడక ’ అనే పుస్తకంలో తన సామాజకవర్గం కోసమే సాగుతున్న చంద్రబాబు పాలన గురించి పెద్ద స్ధాయిలోనే మండిపడ్డారు. వివిధ సందరర్భాల్లో చంద్రబాబు వ్యవహరించిన విధానాలకు కారణాలను స్పష్టంగా వివరించారు. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుకా సామాజికవర్గం కోణమే కనిపిస్తోందన్న ఆరోపణలకు అధికార పార్టీ నుండైతే సమాధానం లేదు.

 

గుంటూరు జిల్లా దాచేపల్లిలో అక్రమ మైనింగ్ విషయంలో హైకోర్టు ఎంత గోల చేసినా చంద్రబాబులో ఎటువంటి చలనం కనిపించలేదు. కారణమేమిటంటే, ఆరోపణలకు కేంద్రబిందువైన గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివసరావు తన సామాజికవర్గం కావటమే. ఇక ఆర్దిక నేరగాడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ప్రజా ప్రతినిధుల్లోనే అత్యంత అరాచకవాదిగా ముద్రపడిన దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ చౌదరిని కట్టడి చేయకపోవటంలో కూడా సామాజిక వర్గ కోణమే అడ్డుపడుతోందనే ఆరోపణలు కావాల్సినున్నాయి.

 

ఇక, రాజధాని నిర్మాణం కోసం అమరావతిని ఎంచుకోవటం తో పాటు వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టటం, వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న పట్టించుకోకపోవటం, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ నిర్ధారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవటం అంతా సామాజికవర్గం కోణంలోనే అన్నది స్పష్టమవుతోంది. మరి అన్నీ సామాజికవర్గాలూ ఓట్లేస్తేనే ముఖ్యమంత్రయిన చంద్రబాబు గెలిచిన తర్వాత ఒక్క తన సామాజికవర్గం ప్రయోజనాల కోసమే పాకులాడితే వచ్చే ఎన్నికల్లో పరిస్ధితేంటి ? మిగిలిన  సామాజికవర్గాలు చంద్రబాబుకు ఓట్లేస్తాయా ? ఇంత చిన్న లాజిక్ తెలియకుండానే చంద్రబాబు పాలన చేస్తున్నారా ? చూద్దాం మరి ఏం వ్యూహంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారో ?