ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అధికార టిడిపి పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అటు కాంగ్రెస్ మరియు టిడిపి నుంచి కీలక నేతలు వైసిపి లో చేరుతున్నారు. టిడిపిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే వైసిపిలో చేరడం చర్చనీయాంశమైంది. దీంతో టిడిపికి వలసలు పెద్ద తలనొప్పిగా మారాయి.
తాజాగా సినీ హీరో నాగార్జున మంగళవారం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. దీంతో వీరిద్దరి సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున గుంటూరు నుంచి పోటి చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగార్జున ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉండేవారు.
పలుసార్లు వైఎస్ ఆర్ తో కూడా సమావేశమయ్యారు. వై ఎస్ మరణానంతరం ఆయన ఏ పార్టీతో కలవలేదు. అనూహ్యంగా వైఎస్ జగన్ తో సమావేశం కావడంతో వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సందర్శించుకుంది. నాగార్జున తన రాజకీయం కోసం కలిశారా లేక తన సన్నిహితులకు సీటు ఇవ్వాలని కోరారా అనే దాని స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా వీరిద్దరి భేటి ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.