వైసిపిలో సినీ న‌టుడు మోహ‌న్‌బాబు, స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం

 ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ఈ రోజు వైయ‌స్సార్‌సీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ కార్యాలయానికి వచ్చి జగన్ కలుసుకుని పార్టీ చేరారు. పార్టీ కండువా అందించిన మోహన్ బాబు ఆయన పార్టీ లోకి ఆహ్వానించారు. 

 తాను పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని  మోహ‌న్ బాబు వెల్లడించారు.

మోహన్ బాబుకు చంద్రబాబుతో చాలా కాలంగా వైరం ఉంది. అయితే, అది ఎపుడూ రాజకీయ రూపం తీసుకో లేదు. ఇపుడు మోహన్ బాబు వైసిపిలో చేరడంతో  వారిద్దరి మధ్య రాజకీయ పోరాటం మొదలవుతుంది.

చంద్రబాబు అక్రమాల మీద అపుడే సవాల్ విసిరారు. చంద్రబాబు తలపడేందుకు సిద్ధమన్న సంకేతం ఇచ్చారు. వైసిసి ఆయనను స్టార్ క్యాంపెయినర్ చేసే అవకాశం ఉందిన

చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిని ముందు నుంచి తూర్పార‌బ‌డుతోన్న మోహ‌న్‌బాబు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల కోసం తిరుప‌తి వ‌ద్ద విద్యార్థుల‌తో పాటు ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు మ‌నుషులు త‌న‌ను రెచ్చ‌గొడితే చంద్ర‌బాబు అస‌లు బండారాన్ని బ‌య‌ట‌ పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు అక్ర‌మాలు అవినీతి గురించి బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మేన‌ని ఆయ‌న ఇది వ‌ర‌కు ప్ర‌క‌టించారు.