Mohan Babu: తాజాగా తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ముగ్గుల పోటీలు ఆటల పోటీలలో చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ చాన్సలర్ అయిన సినీ నటుడు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..
తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను అని భారీగా డైలాగులు చెబుతూ స్పీచ్ ను మొదలుపెట్టారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు.
కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు మోహన్ బాబు. అనంతరం మోహన్ బాబుకు కన్నప్ప సినిమా గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా వాటి గురించి కూడా స్పందించారు. కాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలామంది నటీనటుల పోస్టర్లను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ డ్రీమ్ ప్రాజెక్టు పై మోహన్ బాబు స్పందిస్తూ.. సిని పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని ఆయన మోహన్ బాబు. ఇకపోతే మొన్నటి వరకు వరుస వివాదాలతో మోహన్ బాబు ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.