జగన్ గా కనిపించనున్న విజయ్ దేవరకొండ

 
(సూర్యం)
 

యూత్ లో క్రేజ్ ఉన్న కుర్రాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా గోతా గోవిందం సినిమాతో హిట్ కొట్టిన విజయ్ ఇప్పుడు మరో ఛాలెంజింగ్ పాత్రకు సై అన్నారు. ఆయన వైయస్ జగన్ గా త్వరలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

 

ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. ఓ ప్రక్క  బాలయ్య ప్రధాన  పాత్రలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతోంది. మరో ప్రక్క దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ని  యాత్ర పేరుతో రెడీ అవుతోంది. వైయస్  రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలకఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర గా దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. 

 

 మలయాళ స్టార్‌ ముమ్మట్టి వైఎస్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర వైయస్ జగన్. సినిమా క్లైమాక్స్ జగన్  తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటంతో ముగుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో తిరిగి పాదయాత్రను జగన్ కొనసాగించటం, ఓదార్పు యాత్ర చేయటం సీన్స్ వస్తాయి. ఆ పాత్ర లో విజయ్ దేవరకొండ కనపడటంతో సినిమాకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. 

 

ఇక ఇప్పటికే టీజర్‌ విడుదల చేశారు. ఆనందోబ్రహ్మ చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న మహి వి.రాఘవ్‌ ఈ బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైఎస్‌ తనయుడు వైఎస్‌. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ చిత్రంలో మమ్ముట్టి, రావురమేష్‌, జగపతి, సుహాసిని, అనసూయ, పోసాని, వినోద్‌కుమార్‌, జీవా, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సత్యన్‌ సూర్యన్‌, సంగీతం కె.