‎Kingdom Collections: కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్న కింగ్డమ్ మూవీ.. మూడవ రోజు కలెక్షన్ ల వివరాలివే!

‎Kingdom Collections: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమా ఇటీవల జూలై 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కింగ్డమ్ సినిమా 39 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

‎ రెండు రోజులకు గాను దాదాపుగా 53 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం కింగ్డమ్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ని ప్రకటించారు. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాకు 53 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే దాదాపుగా 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి.

‎నేడు ఆదివారం వచ్చే వారం ఏ సినిమాలు లేకపోవడంతో కింగ్డమ్ కి కలిసి వచ్చి ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తోంది. రోజురోజుకీ ఈ సినిమాను చూసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వచ్చే వారం మరే సినిమాలు లైన్ లో లేకపోవడంతో ఈ సినిమా మరిన్ని ఎక్కువ కలెక్షన్లు సాధించవచ్చు అని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. వచ్చే వారంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు ఉన్నాయి. దాంతో వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.