Vijay Devarakonda: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమా ఇటీవల జూలై 31న విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా అదిరిపోయే విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ మేకర్స్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో మంచి స్పందన వస్తుంది. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా అక్కడి ప్రేక్షకులు కూడా ప్రేమను చూపించడం ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు.
ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఉంది. సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. మొదటి షో పూర్తయ్యి పాజిటివ్ టాక్ వచ్చిందో అప్పుడు చాలా సంతోషం కలిగింది అని తెలిపారు. ఈ సందర్బంగా విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Vijay Deverakonda: అప్పుడు మూవీ హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు.. విజయ్ కామెంట్స్ వైరల్!
