‎Vijay Devarakonda: ముగిసిన విజయ్ దేవరకొండ ఈడీ విచారణ.. గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్‌ చేశానన్న రౌడీ హీరో!

‎Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత విజయ్ కు వరుసగా అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

‎అలా ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగున్నర గంటల పాటు ఈడి విచారణ కొనసాగింది. అయితే ఈడి విచారణ ముగిసిన అనంతరం హీరో విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఇలా రెండు రకాలు ఉన్నాయి.

‎ నేను A23 అనే గేమింగ్ యాప్‌ ని ప్రమోట్‌ చేశానని క్లారిటీ ఇచ్చాను. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ కూడా ఈడీకి సమర్పించాను. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్‌ గేమింగ్ యాప్‌ ను మాత్రమే ప్రమోట్ చేశాను. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఈడీకి వెల్లడించాను అని తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా రౌడీ హీరో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.