‎Rashmika Mandanna: విజయ్ కోసం అలాంటి పని చేసిన రష్మిక.. మారువేశంలో వెళ్లి అలా!

‎‎Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు కూడా వినిపించాయి. వార్తలకు తగ్గట్టు విజయ రష్మికలు కూడా కలిసి చాలాసార్లు వెకేషన్ కి వెళ్లడం ఒకే చోట కనిపించడం ఒకే రకమైన బట్టలు వేసుకోవడం ఇవన్నీ కూడా ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యాయి.

‎ ఇద్దరిలో ఎవరి సినిమా విడుదల అయినా కూడా ఒకరికొకరు ట్వీట్ చేసుకుంటూ ఉంటారు. అన్ని చేసినా కూడా ప్రేమా పెళ్లి విషయం వచ్చేసరికి ఆ విషయాన్ని దాటి వేస్తూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం కింగ్డమ్. భారీ నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. కింగ్డమ్ రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత రష్మిక ఈ సినిమా గురించి స్పెషల్ ట్వీట్స్ వేసింది. తాజాగా నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికర విషయం తెలిపాడు. నాగవంశీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‎ రష్మిక విజయ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆమె శ్రీరాములు థియేటర్ కి సినిమా చూద్దామని వెల్దామని అనుకున్నారు. కానీ పోలీస్ పర్మిషన్ లేక వెళ్లడం కుదరలేదు. దాంతో ఆమె భ్రమరాంబ థియేటర్ కి ఒక మాములు మనిషిలా మారు వేషంలో వెళ్లి సినిమా చూసారు అని తెలిపారు. దీంతో రష్మిక చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. రష్మిక విజయ్ సినిమా చూడటం కోసం పెద్ద సాహసమే చేసింది, ఎవరైనా గుర్తుపడితే అంతే సంగతి, ఫొటోలు అని అందరూ గుమిగూడేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు విజయ్, రష్మిక ఫ్యాన్స్. ఇది వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు..