ఇందిరాగాంధీగా నటించనున్న విద్యాబాలన్

ఎన్టీయార్ బయోపిక్ లో  పనిచేయడం విద్యాబాలన్ కు అచ్చొచ్చినట్లుంది. ఆమెకు మరొక భారీ ఆఫర్ వచ్చేసింది.

ఇందిరా గాంధీ వెబ్ సీరిస్ లో ఆమె ఇందిరాగాంధీగా నటించబోతున్నారు. సాగరిక ఘెష్ రాసిన ‘ఇందిరా గాంధీ: ఇండియాస్ మోస్ట్ పవర్ ఫుల్ ప్రైం మినిస్టర్’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీయబోతున్నారు. ఈ విషయాన్ని విద్యాబాలన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

మొదట్లో ఈ పుస్తకం ఆధారంగా ఒక ఫీచర్ ఫిల్మ్ యే తీయాలనుకున్నారు. అయితే,  మరీ భారీ పుస్తకం కావడంతో వెబ్ సీరీస్ తీసేందుకు ప్రొడ్యూసర్లు నిర్ణయించారని ఆమె చెప్పారు.

విద్యాబాలన్  ఇపుడు తెలుగులో ఎన్టీయార్ బయోపిక్ లో ఎన్టీరామారావు భార్య బసవతారకం పాత్రపోషిస్తున్నారు. ఎన్టీయార్ గా బాలయ్య నటిస్తున్నారు. ఒక ప్రాంతీయ భాష చిత్రంలో ఆమె పూర్తి స్థాయిలో నటించడం ఇదే మొదలు. అంతకు ముందు ఒక మలయాళీ చిత్రంలో కొద్దిసేపు కనిపించారు.

(feature photo NDTV)