కేసీఆర్ జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. ఆర్జీవీకి సీన్ లేదా?

వివాదాల‌ వ‌ర్మ‌పై నెటిజ‌నుల కామెడీ

వ‌రుస పెట్టి బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీపై తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అంద‌రిపైనా బ‌యోపిక్ లు తీస్తున్న ఆర్జీవీ కేసీఆర్, జ‌గ‌న్ బ‌యోపిక్‌లు.. తీయ‌రా? ఆర్జీవీకి అంత‌ ఖ‌లేజా లేదా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

Read Moreటీడీపీ కోటలకు బీట‌లు కాదు..పునాదే లేకుండా చేస్తారా?

ఇంత‌కీ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అయిన‌ కేసీఆర్.. జ‌గ‌న్ పై వ‌ర్మ సినిమాలు తీయ‌రా? ఆ ఇద్ద‌రూ పాల‌న‌లో ఎవ‌రికి వారు ప్ర‌త్యేక ముద్ర‌తో ముందుకు సాగుతున్నారు. పేద‌లు- రైతులు అన్న కోణాన్ని విడిచిపెట్ట‌కుండా పాల‌న‌లో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. పేద‌ల‌కు అందుబాటులో విద్య‌- వైద్యం- ఆరోగ్యం – వ్య‌వ‌సాయం అంటూ దూసుకెళుతున్నారు.

Read More : ఫ్యాన్స్‌కి `వ‌కీల్‌ సాబ్` నిర్మాత అలా షాకిచ్చారు

అయినా అలాంటి వారిపై సినిమా తీసే ఖ‌లేజా ఆర్జీవీకి లేనే లేదు! అంటూ సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్య‌లు వేడెక్కిస్తున్నాయి. అయినా ఆర్జీవీ కి భ‌య‌మా? ఎన్టీఆర్ పైనే సినిమా తీశాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ప్ర‌త్య‌ర్థుల‌ను షంటేశాడు. చంద్ర‌బాబు పాత్ర‌ను చూపించాడు. చిన‌బాబును ఆడుకున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ టైటిల్ తో త‌న ప్ర‌త్య‌ర్థి అయిన‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ వ‌ల్ల‌నా వివాదాలు ఖాయ‌మ‌ని తేలింది. ఇక అన్న‌య్య చిరంజీవిపై సినిమా తీయ‌న‌న్నాడు.

Read Moreభార‌త్‌లో క‌రోనా.. రికార్డ్ నంబ‌ర్స్ ఇవే..!

అటు త‌మిళ రాజ‌కీయాల్లోనూ ఫింగ‌రింగ్ చేస్తాన‌న్న ఆర్జీవీ మ‌న్నార్ గుడి మాఫియా రాణి శ‌శిక‌ళ‌పై బ‌యోపిక్ తీస్తాన‌న్నాడు. ఒక‌వేళ తీస్తే అందులో జ‌య‌ల‌లిత పాత్ర‌ను… క‌రుణానిధి.. శివాజీ గ‌ణేష‌న్ పాత్ర‌ల్ని చూపిస్తాడు. ఇలా అంద‌రినీ ఆడుకునే వ‌ర్మ జ‌గ‌న్ – కేసీఆర్ జోడీ అంటే ఎందుక‌ని భ‌య‌ప‌డుతున్నాడు? అన్న‌ది నెటిజ‌నుల ప్ర‌శ్న‌. మ‌రి దీనికి వివాదాల‌ ఆర్జీవీ స‌మాధానం చెబుతాడా?