క్రిష్ కు ఆ హీరో డేట్స్ ఇస్తానన్నాడు కానీ..

వరసగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు కథానాయకుడు, మహానాయకుడు రెండు డిజాస్టర్ కావటం క్రిష్ ని ఓ రేంజిలో దెబ్బకొట్టింది. గమ్యం, కంచె వంటి చిత్రాలతో తెచ్చుకున్న పేరు మొత్తం తుడిచిపెట్టేసింది. అంతేకాదు బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక చిత్రం సైతం క్రిష్ కు చికాకులే మిగిల్చింది తప్ప కలిసొచ్చిందేమీ లేదు. దాంతో గత కొంత కాలంగా క్రిష్ అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. మీడియాకు దొరకటం లేదు. దాంతో ఇప్పుడు క్రిష్ ఏం చేయబోతున్నాడు …ఏ హీరోతో సినిమా చెయ్యబోతున్నాడనేది అంతటా ఆసక్తికరంగా మారిన అంశం.

అందుతున్న సమాచారం మేరకు క్రిష్ …ఓ స్క్రిప్టు పనిలో బిజీగా ఉన్నారు. అయితే తెలుగులో మాత్రం చెయ్యాలనే ఆలోచన లేదట. హిందీలో మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టి మణికర్ణికతో పోగొట్టుకున్న పేరుని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. ఆ మేరకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారని సమాచారం. అయితే అక్షయ్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిని ఫినిష్ చేసి మాత్రమే క్రిష్ తో ముందుకు వెళ్లగలరు.

కానీ అంత గ్యాప్ తో అక్షయ్ తో చేసే లోగా తెలుగులో గమ్యం లాంటి ఓ సినిమా చేసి మళ్లీ తన ఉనికిని క్రిష్ చాటుకోవచ్చు కదా అని సహచరులు సలహా ఇస్తున్నారట. దాంతో క్రిష్ తెలుగులో చేయటం కోసం ఓ కథను తన టీమ్ తో కలిసి డిస్కస్ చేస్తున్నాడట. మరి క్రిష్ ఏ సినిమాతో ముందుకు వెళ్తాడు అనేది తెలియాల్సి ఉంది. ప్లాఫ్ అనేది ఎంతలా ఇబ్బందులు పెడుతుందనేది క్రిష్ కెరీర్ సాక్ష్యం అంటున్నారు.