ఆమధ్య రిలీజయిన ఎన్టీయార్ బయోపిక్ జనాలను భయపడితే త్వరలో రాబోయే మరో ఎన్టీయార్ బయోపిక్ ఏకంగా టిడిపినే వణికిస్తోంది. ఈనెలలోనే రామ్ గోపాల వర్మ తీసిన ఎన్టీయార్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీయార్ రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఆ బయోపిక్ రిలీజ్ ను నిలిపేయాలంటూ టిడిపి నేత దేవిబాబు కోర్టులో కేసు వేశారు. టిడిపి నేత కేసు వేయటంతోనే లక్ష్మీస్ ఎన్టీయార్ అంటే టిడిపిలో ఎంత వణికిపోతున్నారో అర్ధమైపోతోంది.
వర్మ తీసిన ఎన్టీయార్ బయోపిక్ లో చంద్రబాబునాయుడును విలన్ గా చూపించారని, ఆ సినిమా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయాన్ని దేవిబాబు తన పిటీషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఎన్టాయర్ కు చంద్రబాబు వెన్నుపోటు ఘట్టాల్లాంటివి సినిమాలో ఉంటాయని టిడిపి ఫిక్స్ అయిపోయినట్లుంది. ఆ ఘట్టాలను గనుక సినిమాలో జనాలు చూస్తే టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని టిడిపి నేతలు ఆందోళనలో ఉన్నారు.
మొన్ననే రిలీజయిన ఎన్టీయార్ బయోపిక్ దెబ్బకు జనాలు పారిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ రెండు భాగాలుగా తీసిన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. బయోపిక్ అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్నదున్నట్లు చూపితేనే జనాలు కూడా హర్షిస్తారు.
ఎన్టీయార్ రాజకీయ జీవితంలో అల్లుడు చంద్రబాబే విలన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీయార్ ను ముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేయటానికి చంద్రబాబు పన్నిన ఉచ్చులో కుటుంబసభ్యులు కూడా పాత్రదారులే. ఆ విషయాలు అందరికీ తెలుసు. అయితే, బయోపిక్ లో మాత్రం బావ కమ్ వియ్యంకుడు చంద్రబాబునే హారోగా చూపించారు. అంటే ఎన్నికల ముందు రిలీజ్ చేయటంలో ఉద్దేశ్యం కూడా అదేలేండి. వాస్తవానికి విరుద్ధంగా ఉండటంతో జనాలు బయోపిక్ ను ఛీ కొట్టారు. దాంతో వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్లు ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. అందుకే సినిమా రిలీజ్ ను ఆపేయాలంటూ కోర్టుకెక్కారు.