సెన్సేషనల్ ప్రకటన చేసిన శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీరెడ్డి త్వరలో తాను నటించబోతున్న సినిమా గురించి అనౌన్స్ చేసింది. చెన్నై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ వివరాలను వెల్లడించింది. “రెడ్డి డైరీ” పేరుతో ఆమె స్వీయ చరిత్రను బయోపిక్ గా తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలియజేసింది.

నేను నటించబోయే ఈ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంఘం హామీ ఇచ్చింది. నన్ను మోసం చేసిన వారి ఆధారాలు ఇంకా నావద్ద ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతాను. కాస్టింగ్ కౌచ్ పోరాటం ఆగదు. ఆరోపణల జాబితా కొనసాగుతుంది. నన్ను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలను రెడ్డి డైరీ మూవీ ద్వారా విడుదల చేస్తానంటూ సెన్సేషనల్ న్యూస్ చెప్పింది శ్రీరెడ్డి.

మూవీ దర్శకుడు మాట్లాడుతూ…శ్రీరెడ్డి జీవితంలోని వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నాము అని తెలిపారు. త్వరలోనే షూటింగ్ వివరాలు బయటపెడతామని వెల్లడించారు.