Sri Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూటమి పార్టీ నేతలను ఎవరైతే విమర్శించి ఉంటారో వారందరిపై కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణమురళిని అరెస్టు చేస్తూ రోజుకు ఒక జైలు మారుస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తదుపరి వర్మ, శ్రీ రెడ్డి కూడా లైన్ లో ఉన్నారని వీరిని కూడా ఏ క్షణమైన పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది.
ఇలా వైసిపి నేతలపై కార్యకర్తలపై వరుసగా కేసులు పెడుతున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి సైతం సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను విడుదల చేశారు తాను అప్పట్లో తెలిసి తెలియక తప్పుగా మాట్లాడానని అందుకు క్షమించమని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని కూడా వేడుకున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి తన వాయిస్ పూర్తిగా తగ్గించిందని చెప్పాలి.
ఇకపోతే పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో శ్రీరెడ్డి కూడా తనకు అరెస్టు తప్పదని కన్ఫామ్ అయ్యారు. ఈ క్రమంలోనే మరొక వీడియోని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతూ… ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారనే విషయం నాకు తెలుసు జగనన్న. రేపు నన్ను అరెస్టు చేసిన కూడా నేను వైఎస్ఆర్ సీపీ పిల్లను కాదని చేతులెత్తేసిన ఎత్తేస్తారు నేను ఇప్పటివరకు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను కానీ ఏ రోజు కూడా నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని అని చెప్పుకోలేదు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు తన పవర్ ఏంటో చూపిస్తున్నారు కార్యకర్తల కోసం ఆయన ఒక కవచంలా నిలబడ్డారంటూ వైసిపి పార్టీకి చెందిన వారిని బూతులు తిడుతూ ఈమె ఈ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో చూస్తుంటే శ్రీ రెడ్డికి తన ఫ్యూచర్ అర్థమవుతుందని తనని ఏ క్షణమైన అరెస్టు చేయచ్చని భయాందోళనలో ఈమె బ్రతుకుతున్నారని తెలుస్తోంది.