తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన పద్మశ్రీ శోభన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో “జాదూజ్ సెంటర్” అనే సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు . ఇటీవల కాలంలో నటీనటులు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు . కొంతమంది గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు . మరి కొందరు ప్రజోపయోగమైన సేవాకార్యక్రమాల ద్వారా ఆర్ధికంగా , హార్దికంగా సహాయపడుతున్నారు .
శోభన నటిగా ఎంత ప్రతిభావంతురాలో , శాస్తీయ నృత్య కళాకారిణిగా దేశంలో ఎంతో గుర్తింపు , గౌరవాన్ని తీసుకొచ్చింది . శోభన 21 మార్చ్ 1971లో కేరళ రాష్ట్రంలో జన్మించింది . 1972లో అమర్ ప్రేమ్ అనే హిందీ చిత్రంలో బాల నటిగా రంగ ప్రవేశం చేసింది . తరువాత 1984లో బాలచంద్ర మీనన్ “ఏప్రిల్ 18” అనే తమిళ సినిమాతో నాయికగా పరిచయం చేశాడు . అదే సంవత్సరం భక్త దృవ మార్కండేయ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి వచ్చింది .
ఒకవైపు నటిస్తూనే మరో వైపు చిత్ర విశ్వేశ్వరన్ దగ్గర భారత నాట్యంలో శిక్షణ తీసుకుంది . 1989లో కలిపిన్య అనే నృత్య అకాడమీ ప్రారంభించింది . 2006లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది . ప్రస్తుతం ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.తెలంగాణ ప్రభుత్వ ‘టి.ఫైబర్’తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో “జాదూజ్ సెంటర్” పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు . సినిమాను ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును టి.ఫైబర్ తో కలిసి ప్రారంభిస్తున్నది . . ఈ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు.. గ్రామీణులకు
విజ్ఞానాన్ని కూడా అందించే సంకలపతో వున్నారు .
తెలంగాణలోని 8 వేల గ్రామాల్లో.. తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ నెలకొల్పేందుకుసన్నద్ధమవుతున్నారు . ఈ సెంటర్స్ ద్వారా . వీటి ద్వారా ఐదు వేల మందికి ఉపాధి , కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వుంది . తాను ప్రజల ఆదరాభిమానాలు ద్వారానే ఈ స్థాయికి వచ్చానని , అందుకే తిరిగి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్టు శోభన ప్రకటించింది .