అందుకోసం ప్రేమను కూడా త్యాగం చేస్తాను అంటున్న పూనమ్

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ ఒక టీవీ సీరియల్లో నటిస్తోంది. ‘స్వర్ణఖడ్గం’ అనే సీరియల్లో పూనమ్ మణిపురానికి చెందిన రాణి వింద్యావతిగా సీరియల్ అభిమానులకు చేరువైంది. ఎపిక్ డ్రామాగా వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

ఈ సీరియల్ లో తన క్యారెక్టర్ గురించి ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించింది పూనమ్. ‘ఈ సీరియల్ లో నా క్యారెక్టర్ ప్రేమకు,త్యాగానికి,న్యాయానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. నీతి నిజాయితీలు గల రాణిగా, రాజ్యంకోసం ఏం చేయడానికైనా వెనుకాడని తత్వంతో మెలిగే క్యారెక్టర్ అది. క్లిష్టమైన పరిస్థితుల్లో నేను రాణిగా రాజ్యపాలన చేయాల్సి వస్తుంది. దానికోసం నా ప్రేమను కూడా వదులుకోవాల్సి వస్తుంది’. ఈ పాత్ర మీద నమ్మకంతోనే నేను నటించటం మొదలుపెట్టాను అని తెలిపింది.