Tollywood: సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీలందరూ కూడా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఇలా సినిమా సెలబ్రిటీలందరూ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారని తెలుస్తుంది అదేవిధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి కూడా చర్చించారు.
ఇక ఈ భేటీలో భాగంగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అయితే ఇలా సినిమా సెలబ్రిటీ లందరూ కూడా రేవంత్ రెడ్డిని భేటీ అవుతున్న తరుణంలో అక్కడ ఒక కామన్ మ్యాన్ సినిమా పెద్దలు కాదు గద్దలు అంటూ ఒక ఫ్లెక్సీ చేతిలో పట్టుకుని హల్చల్ చేశారు. దీంతో మీడియా ఈయనని పలకరించారు.
ఈ సందర్భంగా సదరు కామెంట్ మాన్ సినీ సెలబ్రిటీలపై అలాగే సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎంతో సినిమా పెద్దలు భేటీ అంటున్నారు. కేవలం డబ్బున్న వాళ్లు మాత్రమే సినీ పెద్దల అంటూ ప్రశ్నించారు.వందల కోట్లకు పైగా సినిమాలు తీసే వారే సినీ పెద్దలా అంటూ ప్రశ్నించారు. ఒక సామాన్య ప్రేక్షుకుడిగా నా ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళన చేపట్టినట్లుగా తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం దర్శకులు నిర్మాతలు హీరోలు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు అలాగే ప్రేక్షకులు కూడా ఇండస్ట్రీకి చెందిన వారేనని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని ఆయన తెలిపారు.మాతో కూడా భేటీ కావాలని మా వాదన సమస్యలు కూడా వినాలని కోరాడు. భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే మధ్యతరగతి, సామాన్య ప్రజల కోసం థియేటర్ 60శాతం టికెట్ల ధరలను పెంచవద్దు అంటూ ఈయన ప్రభుత్వాన్ని కోరారు.