సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన మూలంగా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ విధించినప్పటికీ పేపర్లు సరి అయిన సమయానికి అందలేదంటూ అల్లు అర్జున్ ని రాత్రంతా పోలీసులు జైల్లోనే ఉంచటం, శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అవ్వడం అందరికీ తెలిసిందే.
అయితే ఈ లోపు బన్నీకి ఫేవర్ గా కొంతమంది, బన్నీకి వ్యతిరేకంగా మరి కొంతమంది కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేశారు.అయితే అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సపోర్ట్ చేశారు. ఇదంతా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్య అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అదనుగా నటి పూనమ్ కౌర్ కూడా తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. పబ్లిక్ ర్యాలీలో సహా పలు ఘటనలలో చాలామంది అమాయకులు తొక్కిసలాట ఘటనల్లో చనిపోయారు.
ఇటీవల ఒక యంగ్ యాక్టర్ కూడా ర్యాలీలో ఊపిరాడక కార్డియాక్ అరెస్టు తో ప్రాణాలు కోల్పోయాడు. వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్ అల్లు అర్జున్ అంటూ ఒక ట్వీట్ చేసింది. వెంటనే మరొక ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ ఫోటోలని షేర్ చేస్తూ నా ఫేవరెట్ హీరో అని, అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం.. అధికారాన్ని ప్రజల డెవలప్మెంట్ కి వాడటమే నాయకత్వం అంటూ మరొక ట్వీట్ చేసింది.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,రాజకీయాలు చేస్తున్నారు అన్నట్లుగా పెట్టింది. అయితే చాలామంది ఈమె ఆ పోస్టులు ఎందుకు పెట్టిందో, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను అల్లు అర్జున్ కోసం సంఘీభావం తెలిపితే సమంజసం గా ఉంటుంది కానీ ఇలాంటి పోస్టులు పెట్టడం వలన ఉపయోగం ఏమిటి, అటెన్షన్ కోసమే బన్నీ ఫోటో పోస్ట్ చేసింది అంటూ నెటిజన్స్ పూనంపై మండిపడుతున్నారు.
MISUSE OF POWER IS POLITICS,
USE OF POWER FOR BETTERMENT IS LEADERSHIP.#justthoughts
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 13, 2024