Revanth Reddy: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ సంఘటన మాత్రం భారీ స్థాయిలో వివాదానికి కారణం అయింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో ఇది కాస్త ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ అనే విధంగా వివాదానికి కారణంగా నిలిచింది. ఇలా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడానికి కారణం లేకపోలేదని చెప్పాలి.
రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పొలిటికల్ గేమ్ లో అల్లు అర్జున్ బలి పశువుని చేశారా అంటే అవుననే చెప్పాలి. వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం అల్లు అర్జున్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని పలువురు రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ వివాదాన్ని ఈ స్థాయిలో సీరియస్గా తీసుకోవడానికి కారణం తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలే కారణమని తెలుస్తుంది.
ఇటీవల తెలంగాణలో వరుసగా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి ముఖ్యంగా గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తినే అస్వస్థతకు గురి కావడమే కాకుండా సుమారు 48 వరకు విద్యార్థులు మరణించారు. ఇది చిన్న విషయం కాదు అదే విధంగా లగచర్ల రైతుల ఘటనపై కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలలో తీవ్రదుమారం రేపింది. ఈ రెండు విషయాలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చే అంశాలనే చెప్పాలి.
అయితే ఈ సంఘటనలపై రాష్ట్ర ప్రజల దృష్టి పోకుండా ఉండటం కోసమే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వివాదాన్ని హైలైట్ చేశారని ఈయన అల్లు అర్జున్ విషయంలో చేసింది మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేశారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తన పొలిటికల్ గేమ్ లో ఒక నేషనల్ స్టార్ నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి అల్లుఅర్జున్ ని మాత్రం బలి పశువుని చేశారనీ స్పష్టం అవుతుంది.
