మహేష్ బాబు వాయిస్ కి మామూలు క్రేజ్ లేదుగా.. దెబ్బకి సరికొత్త నిర్ణయం తీసుకున్న వాల్ట్ డిస్నీ!

హాలీవుడ్ ముఫాసా ది లయన్ కింగ్ ఐదు సంవత్సరాల క్రితం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమా వచ్చింది. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో ముఫాసా పాత్ర కోసం తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా ప్రదర్శించబడుతున్న హాల్స్ దగ్గర మహేష్ బాబు భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు.కేవలం ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పినందుకే హీరోకి కటౌట్స్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా విజయవాడ అప్సర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ మహేష్ బాబు, ముఫాసా కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకి,సినిమాపై వస్తున్న క్రేజ్ కి యుఎస్ లో రెగ్యులర్ ఇంగ్లీష్ వెర్షన్ కు అదనంగా తెలుగు షోలు కూడా జోడించేలా వాల్ట్ డిస్నీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సిచువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు గుంటూరు కారం మూవీ మేకర్స్. 2024 సంక్రాంతికి విడుదల అయ్యి మొదటి అటు నుంచి డిజార్డర్ టాప్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే అదే సినిమాని 2025 న్యూ ఇయర్ సందర్భంగా మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్.

సుదర్శన్ థియేటర్ లో రెండు షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా అవి నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత అదే కాంప్లెక్స్ లో ఉండే దేవి థియేటర్ లోని రాత్రి తొమ్మిది గంటల ఆటకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా ఆ ధియేటర్ కూడా నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు సంధ్య 35 ఎంఎం థియేటర్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మహేష్ బాబు అభిమానుల హుషారు చూస్తుంటే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేసేలా ఉన్నారు. ఏదైనా ఫ్యాన్స్ కి మహేష్ బాబు పై ఉండే క్రేజే వేరు.