గత రెండు రోజులుగా జానీ మాస్టర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జానీ మాస్టర్ విూద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించామని అన్నారు.
తాజాగా.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో టాలీవుడ్ మిగతా చిత్ర పరిశ్రమల కంటే ఎంతో ముందుందని, వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకు వేధింపులు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవారినైనా మేము విచారిస్తాం అన్నారు. పూనమ్ కౌర్ (Poonam Kaur) కమిటీలో రిపోర్ట్ చేయకుండా.. సోషల్ విూడియాలో పోస్టులు పెడితే ఉపయోగం లేదని, వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరికి ఎంత ఇన్ ఫ్లూయెన్స్ ఉన్నా.. కమిటీ విచారణ మాత్రం న్యాయబద్దంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వ తరపు నుంచి గైడ్ లైన్స్ వస్తే కమిటీకి మరింత బలం చేకూరుతుందన్నారు.
ఇదిలాఉండగా.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు,ఎదుర్కొంటున్న వారు టీఎఫ్‌సీసీకి ఎనీ టైం ఫిర్యాదు చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు వద్ద ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంప్లైంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్- 500096 చిరునామాకు పోస్టుద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫోన్ నంబరు : 98499 72280కు ఫిర్యాదు ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది.