Sonu Sood: నాకు ముఖ్య మంత్రి పదవిని ఆఫర్ చేశారు…. అందుకే వద్దనుకున్నా: సోను సూద్

Sonu Sood: సోను సూద్ బాలీవుడ్ నటుడిగా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన నిజజీవితంలో మాత్రం హీరోగానే వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఈయన తన మంచి మనసును బయట పెట్టుకున్నారు కరోనా సమయంలో ఎంతోమంది వివిధ ప్రాంతాలలో చిక్కుకొని లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయితే వారందరికీ తన సొంత డబ్బును ఖర్చు చేసే సురక్షిత ప్రాంతాలకు తరలించి కడుపునిండా ఆహారం పెట్టారు.

ఈ విధంగా ప్రజాసేవ కోసం తన సంపాదనలో కొంత భాగం ఖర్చు చేస్తూ ప్రజలు మెచ్చిన హీరోగా సోను సూద్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇప్పటికీ కూడా ఈయన సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నానని ఎవరైనా తనని వేడుకుంటే వారికి తనదైన శైలిలోనే సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఎంతో మంది రాజకీయ నాయకులు భావించారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది తనకు రాజకీయాలలోకి రావాలని బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు సోనుసూద్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. మీరు మా పార్టీలోకి వస్తే మీకు సీఎం డిప్యూటీ సీఎం రాజ్యసభకు పంపించడం వంటి పదవులను ఇప్పిస్తామని చాలామంది ఆఫర్ ఇచ్చారు కానీ నేను ఆ అవకాశాలన్నింటిని చాలా సున్నితంగా తిరస్కరించానని సోను సూద్ తెలిపారు.

మరి కొంతమంది బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని తెలియజేశారు. అందుకు నేను అంగీకరించలేదు ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే జవాబు దారీతనంతో పనిచేయాల్సి ఉంటుంది ఆ విషయం నాకు ఏమాత్రం నచ్చదని తెలిపారు. ఇప్పుడు నేను ఎంతో స్వేచ్ఛగా సేవ చేస్తున్నాను ఇకపై కూడా అలాగే ఉంటాను అంటూ ఈ సందర్భంగా పొలిటికల్ పరంగా తనకు వచ్చిన అవకాశాల గురించి సోను సూద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.