Marco: ఉన్ని ముకుందన్ ‘మార్కో’ జనవరి 1, 2025న NVR సినిమా ద్వారా తెలుగులో రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మార్కో’. హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు.

ఇప్పటికే కేరళలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జనవరి 1, 2025 ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో రక్తపు మరకలతో సీరియస్ గా చూస్తున్న ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా వుంది.

ఈ వైలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు, కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. చంద్రు సెల్వరాజ్ డీవోపీ పని చేసిన ఈచిత్రానికి షమీర్ మహమ్మద్ ఎడిటర్.

నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్

రచన & దర్శకత్వం: హనీఫ్ అదేని
నిర్మాత: షరీఫ్ ముహమ్మద్
బ్యానర్: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
తెలుగు రిలీజ్: NVR సినిమా
సంగీతం & బీజీఎం: రవి బస్రూర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జుమానా షరీఫ్
స్టంట్స్: కలై కింగ్సన్
డీవోపీ: చంద్రు సెల్వరాజ్
ఎడిటర్: షమీర్ మహమ్మద్
పీఆర్వో: వంశీ శేఖర్