Pushpa 2: అల్లు అర్జున్ గురించి సంచలన పోస్ట్ చేసిన పూనమ్ కౌర్.. అలా ఇంకెవరు నటించలేరు అంటూ!

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్. ఇటీవల డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కోట్లల్లో కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 1600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టారు అల్లు అర్జున్. కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యిందని సంతోషపడేలోపే పుష్ప 2 సినిమా మేకర్స్ కి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ సినిమా సక్సెస్ అయినందుకు సంతోషమే లేకుండా పోయింది.

ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ పుష్ప 2 సినిమాపై స్పందించారు. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపింరు ఈ సినిమాలో.

 

అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు అంటూ పుష్ప 2 సినిమాపై, బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. అయితే పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేసిన మూవీ మేకర్స్ ప్రస్తుతం స్పందించే పరిస్థితులలో లేరు. అందుకు గల కారణం కూడా మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చుకున్నాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ను కలుస్తానని కూడా తెలిపాడు. ఇలా వరుసగా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ ఘటన ముగిసేలా కనిపించడం లేదు.