ఈ సినిమాతోనే కలెక్షన్ కింగ్ బిరుదు.. మోహన్ బాబు మరో సినిమా విశ్లేషణ!

సినీ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో తన పాత సినిమాలు గురించిన జ్ఞాపకాలని మన అందరి ముందు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క సినిమా గురించి విశ్లేషణ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈసారి అసెంబ్లీ రౌడీ మూవీ గురించి చెప్పుకొచ్చారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన అసెంబ్లీ రౌడీ సినిమా నా సినీ ప్రయాణంలో గొప్ప మైలు రాయి. ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను.

1991లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. ఆకట్టుకునే కథాంశం ఈ చిత్రం సొంతం. పి వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా నా కెరియర్ లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ సినిమా వల్లే నాకు కలెక్షన్ కింగ్ అనే టైటిల్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆ టైం లెస్ మ్యూజికల్ హిట్ సాంగ్స్ నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అంటూ తన ట్వీట్లో మోహన్ బాబు రాసుకొచ్చారు.

ఇక మోహన్ బాబు నట జీవిత విషయానికి వస్తే ఆయన సినిమా రంగంలోకి వచ్చి 50 ఏళ్ళు కావొస్తుంది. తనదైన రీతిలో డైలాగ్స్ చెప్పడం విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం విలినిజంలో కొత్తదనం చూపించడంతో కొద్దికాలంలోనే తెలుగులో మంచి నటుడిగా ఎదిగారు మోహన్ బాబు. ఆయన చేసిన క్యారెక్టర్స్ తెలుగువారి మది లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఇక సినిమా మీద ఉన్న మక్కువతో ఆయన కూతురు లక్ష్మీ ప్రసన్న పేరు మీద శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా నిర్మించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఆయన తన కుటుంబ సమస్యలు రచ్చ కెక్కి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఆయన త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.