కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర దర్శకత్వంలో అతనే హీరోగా నటించిన తాజా చిత్రం యు ఐ. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా హీరోయిన్ రేష్మ నాన్నయ్య పడింది ఎవరు ఈ రేష్మ నానయ్య అంటూ ఆమె గురించి గూగుల్ లో వెతకడం ప్రారంభించారు.తన అందచందాలతో అభిమానులని అలరించిన ఈ భామ ఒక మోడల్.
డైరెక్టర్ ప్రేమ్ రూపొందించిన ఏక్ లవ్ యా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ది లివాన్ బెంగుళూరు టైమ్స్ ఫ్రెష్ ఫేస్ లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈమెకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. 17 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ తో బానదారియల్లి, రానా, వామన వంటి సినిమాలు చేసింది.
అయితే అనేక సినిమాలు చేసినప్పటికీ యు ఐ సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 23 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె వయసు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీ లీలతో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈమె అందం అభినయం చూస్తుంటే శ్రీ లీల లాగే సిల్వర్ స్క్రీన్ పై దుమ్మురేపుతుంది అంటున్నారు. ఇక యుఐ సినిమా విషయానికి వస్తే ఇంతకుముందు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీకి ఈ యు ఐ మూవీ కి కొన్ని పోలికలు కనిపిస్తాయి.
ప్రపంచాన్ని ఏలే కల్కి అవతారంగా ఉపేంద్ర నటన టాప్ లెవెల్. ఉపేంద్ర సినిమాలో తన పాత్రకు తప్ప మిగిలిన పాత్రలకు ప్రాధాన్యం పెద్దగా ఉండదు. అయితే ఈసారి మాత్రం తన చుట్టూ ఉన్న పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాడు ఉప్పి. ఈ సినిమాలో రేష్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఇక సన్నీలియోన్ తన పాత్రలో ఒదిగిపోయిన నటించిదనే చెప్పాలి.