Dil Raju: సినిమాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సినిమా సెలబ్రిటీలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం సినీ సెలబ్రిటీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశం చేశారని చెప్పారు. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తున్నాయి అయితే ఆ వార్తలన్ని పూర్తిగా అపోహ మాత్రమేనని దిల్ రాజు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో పంచుకున్నారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాలనే దానిపై ఆయన చర్చించారు. ఇక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలకు కూడా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలను కల్పించాలి ఏంటి అనే విషయాలు గురించి కూడా చర్చించారని తెలిపారు.
ఇక త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో తాము బేటి కాబోతున్నామని దిల్ రాజు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా చాలామంది సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందని భావిస్తున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిపారు సినీ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని దిల్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు.
