Shruthi Hassan: సినీ నటి శృతిహాసన్ ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఈమె చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే శృతిహాసన్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి కూడా కాస్త దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇకపోతే గత కొంతకాలంగా ఈమె శాంతను హజారికా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు ఈయనతో ప్రేమలో ఉన్న సమయంలో శృతిహాసన్ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చేవారు. అయితే తన ప్రియుడుతో ఈమెకు బ్రేకప్ జరిగిందని బ్రేకప్ తర్వాత శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదని తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. ‘రిలేషన్‌షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటే చాలా భయం వేస్తుందని ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల గురించి కూడా శృతిహాసన్ చెప్పుకు వచ్చారు..
నేను ఓ అందమైన కుటుంబంలో జన్మించాను మా అమ్మ నాన్నలు ఉత్తమమైన జంట అని భావించాను. ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్‌కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో ఒక్కసారిగా అంతా కూలిపోయింది వారిద్దరిని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాము. ఇలా బలవంతంగా వారిని కలిపి ఉంచడం కంటే వారు విడిపోతేనే సంతోషంగా ఉంటారని అది మాకు కూడా మంచిదేనని ఈ సందర్భంగా శృతిహాసన్ తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.