స్పెషల్ టీవీ షోలో ప్రభాస్ !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిగ్గరి. కొత్తవాళ్లతో చటుక్కున మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఈ విషయం ఇండస్ట్రీలో ఎవరైనా చెబుతారు. సినిమా ఇండస్ట్రీలోఅందరితో కలుపుగోలుగా ఉన్నా కూడా అన్నీ ప్రోగ్రామ్స్‌కు అటెండ్ కారు. మరీ దగ్గరి స్నేహితుల ఫంక్షన్స్‌కు మాత్రమే అటెండ్ అవుతుంటారు.
అయితే `సాహో` సినిమా విషయంలో ప్రభాస్ తన పంథాను మార్చుకుంటున్నారట. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా నిర్మాతలు భారీగానే ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
మీడియాలో వీలున్న కీలక ప్రోగ్రామ్స్‌లో `సాహో` సినిమాను ప్రమోట్ చేయాలనుకుంటున్నారట ప్రభాస్. అందులో భాగంగా జీ తెలుగులో వచ్చే `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` ప్రోగ్రామ్‌లో ప్రభాస్ పార్టిసిపేట్ చేస్తారని సినీ వర్గాలంటున్నాయి. ఈ ప్రోగామ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎప్పటి నుండో ప్రభాస్‌ను ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తుంటే.. ఎట్టకేలకు ప్రభాస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి ఓకే చెప్పారని టాక్.