RadheShyam : రాధే శ్యామ్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది…!

RadheShyam : బాహుబలి సిరీస్ ల ఘన విజయం తో ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఇమేజ్ సంపాదించాడు. తరువాత వచ్చిన సాహో మన దగ్గర అవేరేజ్ గా నిలిచినా బాలీవుడ్ లో మాత్రం భారీ కలెక్షనలను రాబాట్టింది. అయితే సాహో తరువాత వచ్చిన రాధేశ్యామ్ అనుకున్న విజయాలను సాధించలేకపోయింది.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ప్రభాస్ నుంచి అభిమానులు సాహో తర్వాత అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని ఊహించారు. అయితే రాధేశ్యామ్ సినిమా విజయం సాధించకపోవడానికి గల కారణాలను కూడా చిత్రాబృందం విశ్లేషించటం జరిగింది.ఈ సినిమా విడుదల సమయానికి ఇంకా కరోనా వ్యాప్తి తగ్గకపోవడమే ప్రధాన కారణం అని హీరో ప్రభాస్ తెలియచేసారు. అంతే కాకుండా ప్రేమ కథల్లో తనని ఆడియెన్స్ ఇష్టపడి ఉండకపోవచ్చు అని, లేక స్క్రిప్ట్ లో ఏమైనా లోపాలు కూడా ఉండవచ్చు అని తెలిపారు.

థియేటర్ లలో డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమా ని ఓటీటీ విడుదల చేయగా మంచి స్పందన ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా తెలివిజన్ ప్రేమియర్ కీ సిద్ధమవుతున్నట్టు హీరో తెలిపారు.కాకపోతే ఇది హిందీ వెర్షన్ లో మాత్రమే, హిందీలో రాధే శ్యామ్ సినిమా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ కాబోతున్నట్టుగా తెలిపాడు. హిందీ లో స్మాల్ స్క్రీన్ మీద ఇలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.