‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. హీరోగా ఎంతటి భారీ చిత్రాలు చేస్తున్నాడో అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా స్వరూపమే మారిపోవడంలో ప్రభాస్ క్రెడిట్ కూడా ఉంది.
పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా కూడా మరే స్టార్ హీరోపై లేనెంత ఒత్తిడి ప్రభాస్ పై ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్ 1000 కోట్లకి పైగా ఉండొచ్చు. అయితే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ స్టామినాని వాడుకునే దర్శకుడు కనిపించడం లేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బోల్తా కొట్టాయి.
ఈ సంక్రాంతికి రాబోతున్న ‘ఆదిపురుష్’ పై కూడా అనుమానాలు ఉన్నాయి. డైరెక్టర్లు ప్రభాస్ ఇమేజ్ తో బడ్జెట్ గేమ్స్ ఆడుతున్నారు తప్పితే.. నిఖార్సైన సినిమా తీయడం ఎవరి వల్లా కావడం లేదు.
ప్రస్తుతం ఉన్నా సినిమాల్లో ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ సినిమాపై మాత్రమే అంచనాలు ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ కే’ తీస్తున్న నాగ్ అశ్విన్ కి కూడా పెద్దగా అనుభవం లేదు. స్టార్ హీరో ని హేండిల్ చేస్తాడో లేదో అనుమానమే. అలాగే సందీప్ వంగ కూడా ‘అర్జున్ రెడ్డి’ తెలుగు లో అదే సినిమాని హిందీ లో తీసి సక్సెస్ అయ్యాడు కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ని హేండిల్ చేస్తాడా లేదా అనేది అనుమానమే.
మరో వైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు మన తెలుగు డైరెక్టర్స్ తోనే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసుకుంటే పోతుంటే…ప్రభాస్ మాత్రం అంతగా అనుభవమ లేని దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నాడు.