Stars Destroying Dubbing Industry : స్టార్లతో డబ్బింగ్ పరిశ్రమకు దెబ్బ?

Stars Destroying Dubbing Industry

Stars Destroying Dubbing Industry : పాన్-ఇండియా వేవ్ హిందీ డబ్బింగ్ పరిశ్రమను దెబ్బతీస్తోందా? వివిధ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్‌లు తమంతట తాముగా హిందీలో డబ్బింగ్ చెప్పడంతో డబ్ హిందీ డబ్బింగ్ ఆర్టిస్టుల కెరీర్‌పై దీని ప్రభావం పడుతోంది.

గత రెండు సంవత్సరాలుగా, దేశం అంతటా చిత్ర పరిశ్రమలు ఒకదానితో ఒకటి మునుపటి కంటే చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాయి.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి సినిమాలు ‘పాన్ ఇండియా’ ఫార్మాట్‌లో విడుదలవుతున్నాయి. హిందీ మాట్లాడే మార్కెట్‌లకు కూడా చేరుతున్నాయి.

అయితే, ఇటీవలి కాలంలో సౌత్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు డబ్బింగ్ ఆర్టిస్టులు ఆ పని చేయకుండా తామే స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

‘సాహో’ కోసం హిందీలో డబ్బింగ్ చేసిన తర్వాత, నటుడు ప్రభాస్ మళ్లీ ‘రాధే శ్యామ్’ కోసం తానే హిందీలో డబ్బింగ్ చెప్పడంతో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ కి తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఈ ట్రెండ్ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదని బాలీవుడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

సూపర్ స్టార్‌లు తమ సినిమాల హిందీ వెర్షన్‌లలో వారి స్వంత పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుంటే, ఈ ధోరణిని ప్రోత్సహిస్తే, హిందీ వెర్షన్‌లకు వాయిస్ ఇస్తున్న ఏకైక జీవనాధారమైన హిందీ డబ్బింగ్ కళాకారులను ఇక్కట్ల పాలుజేస్తుంది.

ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌత్ స్టార్‌కి డబ్బింగ్ చెప్పేటప్పుడు మూడు నుంచి నాలుగు రోజులు ఇస్తారు. వారి ఫీజు ఆ స్టార్ ని బట్టి, ఆ సినిమా ఎలాంటి ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతోందనే దాన్ని బట్టి వుంటుంది.

ముంబైకి చెందిన డబ్బింగ్ డైరెక్టర్ సోఫియా విజ్ అభిప్రాయంలో, ఇది హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులకు ఉపాధిని దూరం చేసే ధోరణే. దక్షిణాది నుంచి చాలా సినిమాలు డబ్బింగ్ కి వస్తూంటాయి. చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులకు దీని ద్వారా మంచి ఉపాధి లభిస్తోంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ చిత్రాలకు తన గాత్రాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత డబ్బింగ్ కళాకారుడు సంకేత్ మాత్రే హిందీ డబ్బింగ్ పరిశ్రమ వృద్ధికి కీలకమైన అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ పరిశ్రమ భారతదేశంలో చాలా ప్రారంభ దశలో ఉంది.

ఈ పునాదిని సృష్టించడానికి సంవత్సరాలుగా పనిచేసిన చాలా మంది సీనియర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, దర్శకులు, రచయితలు ఉన్నారు. ఇప్పుడు ఆర్థికంగా లాభదాయకంగా మారింది.

కాబట్టి, డెలివరీ నాణ్యత పరంగా ప్రపంచ స్థాయికి రావడానికి దశాబ్దాలుగా శ్రమించిన పరిశ్రమను, కేవలం ఒక ప్రముఖ వ్యక్తి భర్తీ చేయడం చాలా అన్యాయమని ఆయన భావిస్తున్నారు.

దక్షిణాది పరిశ్రమల చిత్రాలకు వాటి హిందీ శాటిలైట్ డబ్బింగ్ వెర్షన్‌లకు గొప్ప స్పందన లభిస్తూంటుంది. హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఈ నటులు మంచి గుర్తింపు పొందుతున్నారు. దీనికి కారకులు హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులే. ఈ నటులకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులూ పాపులర్ అవుతున్నారు.

ఇక తమ కెరీర్ స్థిరపడినట్టు భావిస్తూంటారు. అలాటిది స్టార్లే డబ్బింగ్ చెప్పుకోవడంతో దీనికి బ్రేక్ పడుతోంది. ఈ విషమ సమస్య పరిష్కారమవ్వాలంటే దక్షిణాది స్టార్లే పునరాలోచించాలని హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులు కోరుతున్నారు.