Pavan Kalyan : సాహో దర్శకుడితో పవర్ స్టార్…. భారీగా పెరిగిన అభిమానుల అంచనాలు…!

Pavan Kalyan : మెగా ఫ్యామిలీ నుండి వరుస సినిమాలతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మెగా హీరోలు. మెగాస్టార్ చిరంజీవి చేతిలో పది సినిమాలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక పవర్ స్టార్ కూడా వరుస ప్రాజెక్టులతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక రామ్ చరణ్, బన్నీ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు.

పవర్ స్టార్ 2024 ఎన్నికలు వచ్చే లోపు సినిమాలు తీసేసి ఎన్నికలకు సిద్దమవ్వాలని అనుకుంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఇక ఇపుడు జానపద నేపథ్యంలో వస్తున్న హరి హర వీర మల్లులో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 17 శతాబ్దానికి సంబంధించిన సినిమా కావడం విశేషం. ఇక సినిమాలో పవన్ బందిపోటు దొంగగా నటిస్తున్నారు.

ఇక హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు పవన్.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కీ రోల్ లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.మరోవైపు సముద్రఖని డైరెక్షన్‌లో వినోధయ సీతమ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు పవన్. పవన్ కల్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు ఇపుడు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోతో సాహో చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.