షాక్: బాలయ్యపై నాగబాబు మరోసారి వెటకారం

రీసెంట్ గా   నాగబాబు ..బాలయ్య పై చేసిన కామెంట్ వైరల్ అయ్యి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ విషయమై ఫేస్ బుక్ లో ,ట్విట్టర్ లో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. తెలుగు దేశం అభిమానులు, బాలయ్య అభిమానులు నాగబాబుని ట్యాగ్ చేస్తూ చాలా పోస్ట్ లు పెట్టారు. ఈ విషయమై నాగబాబు ఈ రోజు మరోసారి స్పందించారు.

బాలకృష్ణ తనకు తెలియదని చెప్పటం తప్పేనని, ఆయన తనకు తెలిసి అంటూ..బాలకృష్ణ బాగా కామెడీ చేస్తారు. ఆయన మంచి కమిడయన్ అంటూ మాట్లాడారు. అంతా ఇదేంటి బాలయ్యను ఇలా అంటున్నాడు అనుకుంటూంటే తాను మాట్లాడుతున్నది పాతకాలం కమిడయన్ బాలకృష్ణ గురించి అని చెప్పి షాక్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వాట్సప్ లో వైరల్ అవుతోంది. నాగబాబు ఇలా మరోసారి వెటకారం చేస్తూ కామెంట్ చేయటంపై తెలుగు దేశం అభిమానులు మండిపడుతూంటే …మెగా ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.

వివాదం మొదలైన తీరు..

కొన్ని రోజులుగా టీడిపికి.. జ‌న‌సేన‌కు మ‌ధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ..నాగబాబును బాలయ్య గురించిన ప్ర‌శ్న అడిగారు ప్రభు. దానికి నాగ‌బాబు కూడా ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం చెప్పాడు. త‌న‌కు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పాడు.

ఆ బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాను క‌దా.. అంటూనే సారీ సారీ తెలుసు.. ఆయ‌న గురించి నాకు తెలుసు.. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్ నటుడు. అప్పట్లో నేరము-శిక్ష లాంటి సినిమాల్లో కృష్ణ, బాలయ్య కలిసి న‌టించారంటూ చెప్పాడు. ఆ బాల‌య్య కాదండి.. ఇప్పుడు మేం అడుగుతున్న‌ది నందమూరి బాలకృష్ణ గురించి అని ప్రభు అడిగితే.. ఆ త‌రం బాల‌య్య తెలుసు కానీ ఈ త‌రంలో ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి ఆశ్చర్యపరిచారు నాగబాబు.

బాల‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి  తెలుగుదేశం పార్టీ నేతల ఇగోపై దెబ్బ‌కొట్టారు నాగ‌బాబు. ఇప్పుడు మరోసారి ఈ వీడియోతో బాలయ్య ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చారు. 

త‌న‌కు జనసేన పార్టీలో ఓ నాయకుడిగా కంటే సామాన్య కార్యకర్తలా పనిచేయడం తనకు ఇష్టమని ఆ ఇంటర్వూలో తెలిపాడు. మొత్తానికి నాగ‌బాబు చెప్పిన మాట‌లు అటు తెలుగుదేశం వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అంతటా వైరల్ గా మారాయి.