తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ కావడం మొదలయింది. ఈప్రక్రియ అనుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పేరేషన్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. పదవితో పాటు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. అయితే, ఆయన మరో పార్టీలో చేరడం లేదు. తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో గ్రేటర్ టిడిపి చాప్టర్ క్లోజ్ అయింది. 2016 డిసెంబర్ లోజరిగిన ఎన్నికల్లో ఇది పూర్తవుతుందనుకున్నారు. తర్వాతయినా జరుగుతుందనుకున్నారు. చాలా మంది ఎంపిలు, ఎం ఎల్ ఎ టిఆర్ ఎస్ లోకి దూకుతున్నపుడు మందాడి కూడా ఆవేపడతారనుకున్నారు. కాని ఆయన పార్టీ మారకుండా రెండేళ్లు నెట్టుకొచ్చారు.
శ్రీనివాసరావు కెపిహెచ్ బి డివిజన్ ను గ్రేటర్ కు ఎంపికయ్యారు. అయితే, ఆయన ఒంటిరిగా కౌన్సిల్ లో కూర్చోలేక టిఆర్ ఎస్ లో చేరిపోతున్నరాని 2016లోనే వార్తలొచ్చాయి. అపుడాయన దానిని ఖండించారు. ఆయన ముఖ్యమంత్రి నివాసం వద్ద కనిపించడంతో ఈ వార్తలు వెలువడ్దాయి. అయితే, ఈ వార్తలను ఆయన ఖండించారు.
ఇపుడు ఆయన పదవి నుంచి పార్టీ నుంచి తప్పుకున్నారు. తెలంగాణ లో టిడిపి శకం ముగుస్తున్నదని, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆవేదన కలగిస్తున్నదని ఆయన అన్నారు.
జిహచ్ ఎంసి నుంచి టిడిపిని మాయం చేయాలన్న టిఆర్ ఎస్ ఆశయం ఇప్పటికి నెరవేరింది.
2016 లో జరిగిన జిహెచ్ ఎంసి ఎన్నికల్లో టిఆర్ ఎస్ , ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీతుడిచి పెట్టుకు పోయాయి. టిఆర్ ఎస్ కు 99 సీట్లొచ్చాయి. ఎంఐఎం కు 44 వచ్చాయి.అధికారం కోల్పోయిన కాంగ్రెస్ కు కేవలం 2 రెండు సీట్లు మిగిలాయి. టిడిపి బిజెపికి కలిపి 5 అయిదుసీట్లొచ్చాయి.అందుల్ టిడిపికి ఒకటే. జిహెచ్ ఎంసిలో 150 డివిజన్లున్నాయి.
జిహెచ్ ఎంసి ఎన్నిక చాలా భీకరం పోరాటం. టిఆర్ ఎస్ నుంచి ముఖ్యమంత్రి కుమారుడు కెటి రామారావు క్యాంపెయిన్ కు నాయకత్వం వహిస్తే, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఈ అవమానంతో నారా లోకేష్ తెలంగాణ రాజకీయాలను వదిలేశారు.
