Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వా ‘నారి నారి నడుమ మురారి’ 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.

నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్ కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ కావడంతో సంక్రాంతి విడుదలకు పర్ఫెక్ట్.

శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు, శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలు సంక్రాంతి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది.

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను బోగవరపు రాశారు, నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

మరింత ఎక్సయిటింగ్ కంటెంట్‌ను ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ త్వరలో ప్రారంభించడానికి టీం సన్నాహాలు చేస్తోంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, సంయుక్త, సాక్షి వైద్య

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
DOP: జ్ఞాన శేఖర్ VS, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
PRO: వంశీ-శేఖర్

మగాడు జగన్ || Chalasani Srinivas Fires On CM Chandrababu Comments On Pawan Kalyan || Ys Jagan || TR