YS Sharmila: రాష్ట్ర ఎంపీలు మోదీ చేతిలో కీలుబొమ్మలు: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే పనిచేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా, బీజేపీకి బినామీలుగా, మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు.

రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా విభజన హామీలు నెరవేరలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. “పార్లమెంటులో మన ఎంపీలు బుద్ధిమంతుల్లా కూర్చుంటున్నారు. మోదీ మాట్లాడితే చప్పట్లు కొట్టడానికి పోటీ పడుతున్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. పేరుకు వేర్వేరు పార్టీల ఎంపీలు అయినా, వారంతా బీజేపీకి రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు,” అని ఆమె విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు తెలపడం తప్ప, ఎంపీలకు మరేమీ చేతకావడం లేదని ఆమె ఎద్దేవా చేశారు.

Free Bus Travel: ఏపీలో దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం: త్వరలో మార్గదర్శకాలు

Nadendla Manohar: వైసీపీ హయాంలో రైతులకు అన్యాయం.. కూటమి వచ్చాకే భరోసా: మంత్రి నాదెండ్ల ఫైర్

2014 నాటికే విభజన హామీల విలువ రూ. 5 లక్షల కోట్లు అని గుర్తు చేసిన ఆమె, ఆ చెక్కు చేతిలో ఉన్నా ఎన్‌క్యాష్ చేసుకోలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు, అమరావతికి కేంద్ర సాయం నిరాకరణ వంటి అంశాలపై పార్లమెంటరీ కమిటీ నివేదికలు ఇచ్చినా ఎంపీలు మౌనంగా ఉండటం దారుణమని ఆమె పేర్కొన్నారు. “రాష్ట్రంలో 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు నిజంగా తెలుగు బిడ్డలే అయితే, ఇప్పటికైనా విభజన హామీలపై నోరు విప్పండి. ప్రధాని మోదీ మోసాలను పార్లమెంటు వేదికగా నిలదీయండి,” అని షర్మిల డిమాండ్ చేశారు.

అఖండ 2 రిలీజ్ కుట్ర | Journalist Bharadwaj EXPOSED Akhanda 2 Movie Release Issue | Balakrishna | TR