Kamakhya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

Kamakhya: సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలంగాణ మంత్రి సీతక్క ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి టీంకు అభినందనలు తెలియజేశారు.

ఇంటెన్స్, థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.

ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య

కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా

మోసం || Journalist Bharadwaj About Ys Jagan Fires On Chandrababu || Ycp Vs Tdp || Pawan Kalyan || TR