Eesha: ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ‘ఈషా’ మూవీ హైలైట్స్ తెలిపారు చిత్ర నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్.
– ప్రొడ్యూసర్ గా నాకు కొంత గ్యాప్ వచ్చింది. నా గత సినిమా ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ ఆశించినంతగా ఆదరణ పొందలేదు. ఆ సినిమా మంచి కంటెంట్ తో చేసినా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కొందరు టైటిల్ బ్యాడ్ అని చెప్పారు. అయితే మంచి కథల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆ టైమ్ లో డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె నేను ఒక సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకుని దాని మీద వర్కవుట్ చేశాం. ఒక మిడిల్ రేంజ్ హీరో కోసం ప్రయత్నించాం. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. అదే టైమ్ లో శ్రీనివాస్ మన్నె ‘ఈషా’ కథ గురించి చెప్పారు. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ ప్రాజెక్ట్ చేశాను.

– ‘ఈషా’ సినిమాకు ప్రతీది తనే దగ్గరుండి శ్రీనివాస్ మన్నె చూసుకున్నారు. ఆయన ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. పైగా సినిమా అంటే ప్యాషన్ ఉన్న డైరెక్టర్. చాలా కష్టపడతాడు. ఆయనకు తగినంత పేరు రాలేదని నా నమ్మకం. ఇండస్ట్రీలో కష్టపడి, ప్యాషన్ ఉన్న దర్శకులంతా ఫేమ్ కాలేరు. ‘ఈషా’ సినిమాను శ్రీనివాస్ బాగా తెరకెక్కించాడు. నేను ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగుంది. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది.
– మనం ప్రతి హారర్ థ్రిల్లర్ మూవీస్ లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. ‘ఈషా’ సినిమాలోనూ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అయితే సినిమా చివరకు వచ్చేసరికి ఒక పర్సనల్ ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ ఫీల్ తో బయటకు వస్తారు.
– ఈ చిత్రంలో నటించిన త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ ..ఇలా ప్రతి ఒక్కరూ బాగా నటించారు. తమ పాత్రలకు సరిపోయారు. ఇలాంటి జానర్ మూవీస్ కు క్యారెక్టర్ కు సెట్ అయ్యే ఆర్టిస్టులే ఉండాలి లేకుంటే బెడిసికొడుతుంది. ‘ఈషా’లో మెయిన్ లీడ్ అందరూ ఆకట్టుకుంటారు. త్రిగుణ్, హెబ్బాకు ఇటీవల తగినంత ఫేమ్ దక్కలేదు. ఈ సినిమాతో వారికి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే రాజు వెడ్స్ రాంబాయి అఖిల్ గురించి కొన్ని రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియదు. ఆయనకు రీసెంట్ గా వచ్చిన సక్సెస్ మా సినిమాకు కూడా ఉపయోగపడుతుంది. పృథ్వీ చేసిన క్యారెక్టర్ సినిమాలో మరో హైలైట్ గా నిలుస్తుంది.

– హారర్ థ్రిల్లర్ మూవీస్ కు విజువల్స్, సౌండింగ్ క్వాలిటీ బాగుండాలి. ఈ సినిమాలో ఆ రెండూ బాగా కుదిరాయి. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్ పాడిన ఈ రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్స్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్ గా ఉండి శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ తో పాడించాను.
– నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం కొద్ది రోజుల దాకా ఎవరికీ తెలియదు. డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె విజన్ ను నమ్మాను. నేను ఎవరినైనా నమ్మితే ఆ ప్రాజెక్ట్ బాధ్యతలు వారికే అప్పగిస్తా. షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను. లాక్ డౌన్ తర్వాత సినిమా వ్యాపారంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తే గానీ సక్సెస్ రావడం లేదు.
– మా సంస్థలో ఒక ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అఖండ2 సినిమాకు ఎదురైన పరిస్థితి గతం కొన్నేళ్ల సినిమా చరిత్రలో చాలా మూవీస్ కు జరిగింది. ఈ విషయంలో ఆయా నిర్మాతలే సమస్యలు పరిష్కరించుకోవాలి గానీ సినిమా పరిశ్రమ పరంగా, నిర్మాత మండలి పరంగా చేసేందుకేమీ ఉండదు.

